Sunday, January 31, 2016

నాశిరకం సరుకులు తయారుచేసిన కాంట్రాక్టర్ల పై చర్యలు కూడా తీసుకోలేని అసమర్ధ స్థితిలో చంద్రబాబు గారి ప్రభుత్వం

సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు గారి ప్రభుత్వం విడుదల చేసిన చంద్రన్న కానుకలలో నాణ్యత లోపించిందని, దాని వలన తన పరువుకు భంగం కలిగిందని  స్వయంగా ముఖ్యమంత్రిగారే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చీవాట్లు పెట్టిన సంగతి మనకు తెలిసినదే. అయితే ఈ కానుక పేరుతో తయారైన 15 లక్షల బ్యాగులు (రూ. 65 కోట్ల విలువ) ఎవరూ తీసుకోకపోవడంతో వాటిని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం. పేదప్రజలు కూడా తీసుకోవడానికి నిరాకరించిన ఈ పాడైపోయిన సరుకులను దళిత పేద విద్యార్ధులు వుండే హాస్టల్స్ కు ఏ విధంగా సరఫరా చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. ఇది పేద దళిత విద్యార్ధుల పై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిదర్శనంగా తెలియచేస్తుంది. దీనిని లోక్ సత్తా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి నాశిరకం సరుకులు తయారుచేసిన కాంట్రాక్టర్ల  పై చర్యలు కూడా తీసుకోలేని అసమర్ధ స్థితిలో చంద్రబాబు గారి ప్రభుత్వం వుందని విమర్శించింది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వుపసంహరించుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని లోక్ సత్తా పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.

No comments:

Post a Comment